News Desk

భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించండి..

ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టంపల్లి తాండ గ్రామం వద్ద జరుగుతున్న జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ముదిగుబ్బ,బుక్కపట్నం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో…

Read More

ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి ప్రశాంత జీవనం గడపాలి…

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనమును గ్రామ ప్రజలు గడపాలని ఇలా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ ప్రభావిత ఓబులనాయనపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించారూ. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా విన్నారు.ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న…

Read More

ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి

నిడమర్రులో స్వీకరించిన అర్జీలు 45 ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్: అభిషేక్ గౌడ(ఏలూరు జిల్లా) : విశాలాంధ్ర – నిడమర్రు:మూడవ విడత ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలుఁ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింటు కలెక్టరు డాక్టర్ యం జె అభిషేక్ గౌడ, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సంయుక్తంగా పాల్గొన్నారు.నిడమర్రు తహశీల్దారు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.నిడమర్రు గ్రామానికి సంబంధించిన మూడవవిడత కార్యక్రమంలోజె సి ,ఎమ్మెల్యే ప్రజలు నుండి అర్జీలను…

Read More

భూమి వివాదంలో ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. శనివారం ఈ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు…

Read More

ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్) శనివారం ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ విద్యా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస…

Read More

పిల్లల పార్కు కు మరమ్మత్తులు – Visalaandhra

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, పశువుల హాస్పిటల్ పక్కన నిర్మించిన “జగనన్న బాలల ఆనంద వేదిక” పిల్లల పార్కులో శిధిలావస్థకు చేరుకున్న ఆట పరికరాలకు శనివారం మరమ్మత్తులు చేపట్టారు. దివంగత ఎన్ వెంకట రెడ్డి జ్ఞాపకార్థం, శ్రీరామదాసు పేపర్ బోర్డు సౌజన్యంతో కడియం పశువుల హాస్పిటల్ పక్కన, సుమారు ఐదు సంవత్సరాల క్రితం, బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పర్యవేక్షణలో ఈ…

Read More

మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం..

సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు…

Read More

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ..

భారత క్రికెట్‌లో ఓ యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఏకంగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్లలోనూ అతడికి స్థానం లభించింది. దీంతో భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్…

Read More

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం ఃఅమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…

Read More

సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి

నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతిపొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటనమృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులుపశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, తాగునీరు లభించక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. అధికారిక…

Read More