ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి


నిడమర్రులో స్వీకరించిన అర్జీలు 45

ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్: అభిషేక్ గౌడ
(ఏలూరు జిల్లా) : విశాలాంధ్ర – నిడమర్రు:మూడవ విడత ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలుఁ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింటు కలెక్టరు డాక్టర్ యం జె అభిషేక్ గౌడ, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సంయుక్తంగా పాల్గొన్నారు.నిడమర్రు తహశీల్దారు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.నిడమర్రు గ్రామానికి సంబంధించిన మూడవవిడత కార్యక్రమంలో
జె సి ,ఎమ్మెల్యే ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు. దివ్యాంగుని దగ్గరకు జిల్లా జాయింటు కలెక్టరు, ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి అర్జీని స్వీకరించి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. ముందుగా గత రెండువారాల్లో వచ్చిన అర్జీలుపై శాఖలు వారీగా సమీక్షించి, పరిష్కారంలో వెనుకబడిన శాఖలు అధికారులకు జిల్లా జాయింటు కలెక్టరు దిశానిర్దేశం చేశారు. జెసి మాట్లాడుతూ ప్రజలు తమ గ్రామంలోనే నేరుగా అధికారులను కలుసుకుని తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇదో చక్కని వేదిక అని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు నుంచి అందిన అర్జీలను పారదర్శకంగా పరిష్కరించాలని అన్నారు. గ్రామస్థాయిలో సమస్యలను అధిక ప్రాధాన్యత నిచ్చి త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని సమస్యలు విషయంలో అర్జీదారులకు కారణాలను స్పష్టంగా తెలియ జేయ్యాలని అన్నారు. మూడు విడతలుగా నిర్వహించిన పిజిఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలుపై తీసుకున్న చర్యలు నివేదికలతో తదుపరి సమావేశానికి హాజరు కావాలని సూచించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ శాఖల్లో వచ్చిన ధరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తి స్థాయిని పెంచేలా తగిన పరిష్కారం చూపాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన మూడు గ్రామసభలలో వచ్చిన ఫిర్యాదులు నూరుశాతం పరిష్కారం చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్న, తహశీల్దారు గద్దె శ్రీధరుబాబు, యంపిడివో జి.విజయ కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *