సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి, కాలుష్య రహిత సమాజ స్థాపనకు పర్యావరణ అవశ్యకతను గుర్తించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియ కావాలని తెలిపారు.ఈ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. లక్ష్మీనారాయణ. బార్ వైస్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి , సీనియర్ న్యాయవాదులు నాగరాజు, శంకర్ నారాయణ రెడ్డి, దుర్గాప్రసాద్, బాల సుందరి, తదితరులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.


