ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ముదిగుబ్బ దినసరి కూలీ మృతి


వైద్యుల నిర్లక్ష్యంతో మృతి.. న్యాయం చేయండి.. ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు.
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలానికి గేట్ గొట్టాలకు చెందిన ఆశాభి అనే దినసరి కూలీ మృతి వైద్యుల వలన నిర్లక్ష్యంతో మృతి చెందిందని, వైద్యుల పైన చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్పు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అయితే ఈ ఘటనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.మృతురాలి కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, పదేళ్ల క్రితమే ఆమె తండ్రి మరణించగా, తాజాగా తల్లి కూడా మృతి చెందడంతో ఆమె కుమార్తె అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు, అనాథగా మిగిలిన బాలికను ప్రభుత్వమే ఆదుకుని ఆమె విద్య, భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యానికి బాధ్యులైన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు ఈ ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *