ఏపీలో ఎండలు భగ్గుమంటున్నాయి.. 46 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు! Andhra Pradesh heat wave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ ప్రాంతాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 13 జిల్లాల…


