Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. |


Last Updated:

తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు

+

News18

News18

తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ కేసులో పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చిన ముగ్గురు యువకులను తన వద్దకు పిలిపించుకున్న న్యాయవాది గుణశేఖర్.. తనకు ఇబ్బందిగా మారుతున్న కానిస్టేబుల్‌ను హత్య చేస్తే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం.

అయితే ఆ యువకులు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆ న్యాయవాది మరికొంతమందిని కూడా ఈ కుట్రలోకి దింపేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గంజాయి కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన వారిని టార్గెట్ చేసి, వారితో ఒప్పందాలకు దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో తిరుపతి పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది.

అలిపిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నెంబర్ 180/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెయిల్‌పై విడుదలైన ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లను వీఆర్‌వోల సమక్షంలో నమోదు చేసి, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయవాదిగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ఒక కానిస్టేబుల్‌పై ఇంత తీవ్ర స్థాయిలో కుట్ర పన్నాల్సి వచ్చింది? ముద్దాయిలతో ఆయనకు సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థకు చెందిన వారిపైనే ఇలాంటి కుట్రలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *