ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ!
ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట నిజమేనన్న ఆర్బీఐ గవర్నర్ భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని, అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది….


