ధర్మపురి గ్రామంలో కేత్ బచావో అభయాన్ కార్యక్రమం నిర్వహణ..


మండల వ్యవసాయ అధికారి ముస్తాఫా
విశాలాంధ్ర- ధర్మవరం ; మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో కేత్ బచావో అభయాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు ధర్మవరం డివిజన్ లక్ష్మా నాయక్ పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి వాడుకుని రైతులు వ్యవసాయం చేసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయం అంటే కేవలం పంటలు మాత్రమే కాకుండా పాడి పంటలు లగ ఉండాలి ఎరువుల వాడకాన్ని తగ్గించి పశువుల ఎరువును, వర్మీ కంపోస్టు వంటి వాటిని వాడటం వల్ల భూమిలో సేంద్రీయ పదార్థాలు, కర్బన పదార్థాలు మొక్కకు అందేలా చేసి మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి సహాయపడుతుంది అని తెలియచేశారు. పురుగుమందులను తగ్గించి, బీజామృతము, ఘనజీవామృతము, వావిలాకు కషాయము మొదలగు వాటిని పొలాల్లో వేసుకొని పంటలు పండించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కి సంబంధించి విత్తన వేరుశన కాయలు పంపిణీ రైతు సేవా కేంద్రాల్లో జరుగుతున్నది అవసరమైన రైతులు వెంటనే నమోదు చేసుకొగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో అశ్విని, బీటీఎం ప్రతిభ, ఈ హెచ్ ఏ రాజశేఖర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *