ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి


విశాలాంధ్ర – పుట్టపర్తి: ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, పింఛన్లు, గృహాలు, తాగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సుమారు 26 వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *