తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్
టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు….


