Mangoes Ripening Test: మ్యాంగోస్ కొనేటప్పుడు,తినే ముందు ఇలా చేస్తే.. కెమికల్స్ స్ప్రే చేశారో లేదో తెలిసిపోతుంది | లైఫ్ స్టైల్


Last Updated:

Mangoes: మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలు స్ప్రే చేసిన మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు అందులో ఏవి రుచికరమైనవి, వేటిని రసాయనాలు స్ప్రే చేయకుండా మగ్గించారనే విషయం బయటకు తెలియదు. అందుకే ఈ ట్రిక్ పాటిస్తే మనం కొనుక్కునేవి, తినే మామిడి పండ్లు ఆర్గానిక్ లేదా రసాయనాలతో మగ్గించినో ఇట్టే తెలిసిపోతుంది.

+

Mangoes

Mangoes Ripening Test

Mangoes: మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలు స్ప్రే చేసిన మామిడి పళ్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు అందులో ఏవి రుచికరమైనవి, వేటిని రసాయనాలు స్ప్రే చేయకుండా మగ్గించారనే విషయం బయటకు తెలియదు. అందుకే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మనం కొనుక్కునేవి, తినే మామిడి పళ్ళు ఆర్గానిక్ లేదా రసాయనాలతో మగ్గించినో ఇట్టే తెలిసిపోతుందని లోకల్18తో తెలిపారు. మరి ఈ చిట్కాలు ఏవో తెలుసుకుంటే మీకు మంచిది.

మామిడి పండుకి పరీక్ష..

మార్కెట్లో మనం కొనుగోలు చేసిన మామిడి పండ్లు రుచికరమైనవో లేదో .. ఆర్గానిక్ పద్దతిలో పండించినవో లేక రసాయనాలు స్ప్రే చేసినవో తెలుసుకోవాలంటే ముందుగా మామిడి పండ్లను నీట్లో వేసి పరిశీలించాలని విశాఖపట్నంకు చెందిన మ్యాంగో మ్యాన్ అప్పాజీ తెలిపారు. మామిడి పండ్లు నీటిలో మునిగితే అవి ఆర్గానిక్ ప్రాసెస్‌లో మగ్గినవిగా పరిగణించవచ్చు అంటున్నారు. పండు పట్టుకొని వాసన చూడగానే గుమగుమలాడే సువాసన వస్తే అవి కచ్చితంగా మంచివే అంటున్నారు. రసాయనాలు కలిపిన మామిడిపండ్లు అయితే గుమగుమలాడే సువాసనలు రావని అంటున్నారు. కొన్ని పండ్లు మే నెలలో అందుబాటులోకి వస్తాయి. ముందుగా వచ్చిన మామిడి పండ్లు అన్ని రసాయనాలు కలిపినా మామిడిపండ్లేనని అంటున్నారు. అందుకే ఈ చిట్కాలు తెలుసుకోవాలని ప్రజలందరూ జాగ్రత్తగా వహించాలని అంటున్నారు.

కెమికల్ ఫ్రీ ఫ్రూట్ ..

కొన్ని నియమాలు పాటించి మామిడి పండ్లను తినాలంటున్నారు. మ్యాంగోస్ రసాయన అవశేషాల నిర్మూలన చేయాలంటున్నారు. మామిడి పండ్లు పండించేందుకు కొంతమంది రైతులు కృత్రిమ పురుగుల మందులు అధికంగా వినియోగిస్తారు. మామిడి పండుపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. మార్కెట్ లో అమ్మేటప్పుడు నిల్వ ఉండేలా పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా మరికొన్ని రసాయనాలు వాడుతారు. మార్కెట్ లో కొనే మామిడిపండ్లను పారే నీటితో కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వలన ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే అవకాశం ఉందని అప్పాజీ లోకల్18 ద్వారా మ్యాంగో లవర్స్‌కి తెలిపారు.

ఇలా చేస్తే మామిడి పండ్లు వేడి చేయదు..

ఇలా చేయడం ద్వారా మామిడి పళ్ళు సురక్షితమైన ఆహారంగా మారుతుంది. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు తొలిగిపోతుంది. ఈ జిగురు రసం నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి సమస్యలు వస్తాయని అప్పాజీ సూచిస్తున్నారు. మామిడి పండ్లు ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా కొన్ని నియమాలు ఉన్నాయని చెబుతున్నారు. మామిడి పండుని నీటిలో నానబెట్టడం ద్వారా దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. అలా చేసి తినడం ద్వారా ఎటువంటి వేడి చేయకుండా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ మామిడి పండ్లలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే శరీరం వేడిని పెంచడానికి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్‌షిప్ గైడెన్స్, ఫిట్‌నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *