ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 44.6 మి.మీ, అమలాపురంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలులో 41.1°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, రాబోయే వర్షాలతో ఎండ వేడి నుండి ఉపశమనం లభించనుంది.
Source link
Andhra Weather Alert: ఏపీలో 5 రోజులు వర్షాలు.. కోస్తాంధ్రకు వెదర్ వార్నింగ్!


