కేరళం సీఎంగా వి.డి.సతీశన్ – Visalaandhra

కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. గురువారం న్యూఢిల్లీలో సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. కేరళం ముఖ్యమంత్రి పదవి రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేరళంలోని పార్టీ కేడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వి.డి.సతీశన్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చివరగా సతీశన్ ఎంపిక.. ఏప్రిల్‌లో నాలుగు రాష్ట్రాలు,…

Read More

నీట్‌ లీక్‌ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే డాక్టర్‌గా చలామణి

సంచలనం రేపిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్‌ను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.అయితే అతడిపై దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి.స్థానికంగా డాక్టర్‌గా పేరుపొందిన శుభం అసలు ఒక్కరోజు కూడా వైద్యకళాశాలకు వెళ్లలేదని విచారణలో తేలింది.శుభం స్వగ్రామం నందగావ్‌. నాసిక్‌లో విద్యార్థులతో ఎప్పుడూ కిక్కిరిసే శిక్షణ కేంద్రాల ప్రాంతంలో అతడు ఎస్‌ఆర్‌ విద్యా మార్గదర్శక కేంద్రం…

Read More

పంచదార ఎగుమతులపై నిషేధం – Visalaandhra

న్యూదిల్లీ: పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం… ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఈ నిషేధం మే 13 నుంచి సెప్టెంబర్ 30…

Read More

పంజాబ్ కింగ్స్ పుంజుకునేనా?

నేడు ముంబైతో అమీతుమీముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌కి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇప్ప్పుడు ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు కనీసం రెండు విజయాలు అవసరం. ఇదీ ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి. ఆ జట్టు నేడు (గురువారం)ముంబయి ఇండియన్స్‌ను ఢీకొంటుంది. పరాభవ పరంపరకు పంజాబ్ ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది ఆసక్తికరం….

Read More

చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లి ఘటన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మొక్కజొన్న రైతులపై దాడులు జరిగాయని, అక్రమ కేసులు పెట్టారంటూ వైసీపీ చేపట్టిన చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు… ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై విరుచుకుపడ్డారు. రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడులు చేయించడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఁవచ్చే ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం, ఇది రాసుకోండిఁ…

Read More

ఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు

తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ…

Read More

చంచల్‌గూడ జైలులో ఫీల్ ది జైల్ కార్యక్రమం ప్రారంభం

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాహైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఃఫీల్ ది జైల్ః పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు. ఖైదీల జీవనశైలి, వారు ఎదుర్కొనే పరిస్థితులు, స్వేచ్ఛ విలువ గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా 24 గంటల పాటు…

Read More

నాల్గవ జోన్ కలయికతో పరిధి పెంచుకున్న కాకినాడ ఎపిఐఐసి ప్రాంతీయ కేంద్రం

— ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని విశాలాంధ్ర – కడియం : పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కాకినాడ ఏపీఐఐసీసీ ప్రాంతీయ కార్యాలయం నాలుగవ జోన్ కలయికతో మరింత పరిధి పెంచుకుంటుందని ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం కాకినాడ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కూడా కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో కలవడంతో పరిధి విస్తరించిందని పేర్కొన్నారు. అన్ని వనరులు…

Read More

అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్,…

Read More

రాజాంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక- కలెక్టర్ సమక్షంలో వినతి అవకాశం

విశాలాంధ్ర- రాజాం(విజయనగరం జిల్లా): రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం తేదీ 15.05.2026 నుండి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజాం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడనుంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ వ్యక్తిగత, భూసంబంధిత, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను…

Read More