శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా బస్సు షెల్టర్ అశుభ్రంగా ఉండడంతో గ్రామ ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామ ప్రసాద్ తన వాలంటీర్లతో అక్కడికి వెళ్లి పాత బస్ షెల్టర్‌ను శుభ్రపరిచి పెయింటింగు రంగులను వేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కన్వీనర్ నామ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఉన్న ఈ బస్సు షెల్టర్ ను శుభ్రపరచడం ఆరోగ్యాన్ని అందించడం మా లక్ష్యము అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 13 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


