విశాలాంధ్ర- రాజాం(విజయనగరం జిల్లా): రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం తేదీ 15.05.2026 నుండి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజాం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడనుంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ వ్యక్తిగత, భూసంబంధిత, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్ కి వినిపించే అవకాశం కల్పించబడింది. అందువల్ల నియోజకవర్గ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని రాజాం తహశీల్దార్ యం. రాజశేఖర్ కోరారు.


