ఆంజనేయ స్వామి మాన్యం భూమి ఆక్రమణ (ఆన్‌లైన్) నమోదుపై చింతలపల్లి గ్రామస్థుల ఆగ్రహం

విశాలాంధ్ర ధర్మవరం;మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఉన్న స్వామి మాన్యం (దేవుడి) భూమి కొంతమంది వ్యక్తుల పేరిట ఆన్‌లైన్ కావడంపై స్థానిక గ్రామస్థులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో చింతలపల్లి మహేష్ చౌదరి ,గ్రామస్థుల తో పాటు ఆర్డీఓ, ఎంఆర్‌ఓలను కలిసి ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం… చింతలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 253 లో…

Read More

హెచ్ఐవి మృతులకు నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం : హెచ్ఐవి మృతులకు, ఎయిడ్స్ బారిన పడి మృతి చెందిన వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం అనంతపురం వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ క్యాండిల్ లైట్ డే దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, శక్తి మైత్రి మహిళా సంఘం, స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు…

Read More

యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు..

పేటీఎం పాకెట్ మనీ వచ్చేసిందిబ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం పాకెట్ మనీ ఫీచర్రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితిడిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం, టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పాకెట్ మనీ పేరుతో నేడు ప్రారంభించిన ఈ కొత్త సదుపాయం ద్వారా బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు కూడా నేరుగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు అవకాశం కలుగుతుంది. నగదు కోసం లేదా చెల్లింపులు పూర్తి…

Read More

సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు..నా దేశం కోసం పోరాడుతూనే ఉంటా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు. తనకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అయిన అవామీ లీగ్ పై నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. నేను బంగ్లాదేశ్‌లో లేనంత మాత్రాన…

Read More

ఆలయాల బంగారంపై కేంద్రం స్పష్టీకరణ.. వదంతులను నమ్మొద్దని సూచన

దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. దేవాలయాల బంగారు నిల్వలను ప్రభుత్వానికి అప్పగించి వాటి స్థానంలో బంగారు పత్రాలు ఇవ్వబోతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా వేదికల్లో ప్రచారం సాగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దేవాలయాల ట్రస్టులు, మతపరమైన సంస్థల బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుందన్న ప్రచారం…

Read More

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు.. వారంలో ఇది రెండోసారి

దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై సుమారు 90 పైసల వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగినట్లు తెలుస్తోంది….

Read More

మీరంతా ఉండగా ఒంటరినెలా అవుతాను?: సల్మాన్

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరలైంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వైరల్ పోస్ట్‌పై సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆ మెసేజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఆ పోస్ట్‌ను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలుగా మార్చడంతో తన తల్లి కంగారుపడిందని అన్నారు. ‘నేను నా గురించి మాట్లాడలేదు. అయినా… ఇంత…

Read More

గల్ఫ్ దేశాల అభ్యర్థన…ఇరాన్‌పై దాడి నిలుపుదల: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను నిలుపుదల చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు దాడి నిర్ణయాన్ని తాజాగా ఆయన పక్కన పెట్టేశారు. ఈ మేరకు ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్‌లో పోస్టు ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. ఇరాన్‌పై మంగళవారం సైనిక దాడికి ప్రణాళిక వేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే, తెహ్రాన్‌తో ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నందున… దాడిని వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకుల నుంచి తనకు ప్రత్యక్షంగా…

Read More

శుభకార్యాల్లో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా):సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్థానిక సభ్యులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఇటీవల రెడ్డి శ్రీనివాసరావు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రాజాం పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ ఆర్.వి.జె నాయుడు మాట్లాడుతూ ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు…

Read More

మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటాలు ఆగవు..

సత్య సాయి ఎర్రగుంట పంపు హౌస్ కార్మికులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట పంపు హౌస్ వద్ద గల సత్యసాయి కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయేంతవరకు తమ పోరాటాలు ఆపమని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి యొక్క నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. కార్మికులందరూ నోటికి రిబ్బన్ కట్టుకొని తమ మౌన పోరాట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు రాక కార్మికులు చాలా…

Read More