శుభకార్యాల్లో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు


విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా):సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్థానిక సభ్యులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఇటీవల రెడ్డి శ్రీనివాసరావు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రాజాం పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ ఆర్.వి.జె నాయుడు మాట్లాడుతూ ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు జరుగుతుందని, అందరూ ఈ కార్యక్రమాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసపు సత్యనారాయణ, శాసపు జగదీష్, వెంకటరావు, అప్పలనాయుడు, ఉపేంద్రతో పాటు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.

The post శుభకార్యాల్లో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *