మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటాలు ఆగవు..


సత్య సాయి ఎర్రగుంట పంపు హౌస్ కార్మికులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట పంపు హౌస్ వద్ద గల సత్యసాయి కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయేంతవరకు తమ పోరాటాలు ఆపమని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి యొక్క నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. కార్మికులందరూ నోటికి రిబ్బన్ కట్టుకొని తమ మౌన పోరాట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు రాక కార్మికులు చాలా ఇబ్బందిపడుతూ దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లడం జరిగింది అని బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ,అధికారులు తక్షణమే స్పందించి కార్మికులకు ఐదు నెలల వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల కొండారెడ్డి, సత్య సాయి వాటర్ సప్లై యూనియన్ నాయకులు, చింతకాయల నరేష్, ఈశ్వరయ్య,నారాయణ కుమార్ రెడ్డి, రామాంజి,రియాజ్ భాషా, మస్తాన్, గణేష్, రమణ నాయక్, ధనుంజయ, శివ,ప్రభు,రాజేంద్ర రెడ్డి, శివ,శీన, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *