‘ఉగ్రవాద నిరోధక చట్టం కేసులోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ అనేది ఒక రూల్్ణ అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు గతంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన సొంత ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్…


