మమతకు ‘సుప్రీం’లో చుక్కెదురు
ఎన్నికల సంఘం సర్క్యులర్‌కు ఓకే న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు వేళ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను నియమిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. లెక్కింపు…


