Annavaram Temple: అన్నవరంలో కనులపండువగా చక్రస్నాన మహోత్సవం.. పంపా శిరోవరంలో జలకాలాడిన స్వామి అమ్మవార్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతి దేవుల చక్రస్నాన మహోత్సవం పంపా శిరోవరంలో ఘనంగా, భక్తుల నడుమ ఆధ్యాత్మికంగా జరిగింది

+

News18

News18

అన్నవరం పంపా శిరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల జలస్నాన మహోత్సవం అత్యంత కనులపండువుగా జరిగింది. రత్నగిరి కొండలు దిగి పంపా రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న శిరోవరంలో స్వామి అమ్మవార్లు జలకాలాడారు, నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు. దేవతామూర్తులు స్నానమాచరించే నీళ్లు మన తలపై పడే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తారు.

అలా స్వామి అమ్మవార్ల పాదాలు తాకిన నీళ్లు మన తలపై పడితే మనలో ఉన్న సమస్యలు వైదొలుగుతాయని, స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో నిండు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది శ్రీ స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అత్యంత ఆధ్యాత్మిక ఘట్టం స్వామి అమ్మవార్ల శ్రీ చక్రస్నాన మహోత్సవమని చెప్పుకోవచ్చు. స్వామి వారి కళ్యాణం మహోత్సవం, తర్వాత స్వామివారి పుష్కరిణి అయిన పంపా శిరోవరంలో స్వామి అమ్మవార్లకు ఈ ఆధ్యాత్మిక ఘట్టం అత్యంత ఘనంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు.

పంప శిరోవరంలో అర్చక బృందం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో మూడుసార్లు పుణ్యస్నానం ఆచరించి అంటే శ్రీ చక్రస్నానం నిర్వహించి, పంప నది ఒడ్డున కర్రల వంతెన ఏర్పాటు చేసి వంతెనపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు పెట్టి, ఆపై పుణ్య నదీజలాలతో అభిషేకం చేస్తూ ఆ నీరు కింద ఉన్న భక్తుల తలపై పడే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. పరమ పావనమైన శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి సత్యవతి దేవి పాదాలు తాకిన నీళ్లు భక్తుల తలపై పడటం ద్వారా ఎంతో పుణ్య ప్రాప్తి లభిస్తుందని అర్చక స్వాములు తెలియజేశారు.

మేళ తాళాలు భాజాబజంత్రీలు నడుమ రత్నగిరి కొండల నుంచి పంప నది రిజర్వాయర్ ప్రాంగణం వద్దకు చేరుకుని ఈ చక్కని ఆధ్యాత్మిక ఘట్టం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గోవింద నామాలు జపిస్తూ ఈ చక్కని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కాగా స్వామి వారి కల్యాణ మహోత్సవాలు శ్రీ పుష్ప యాగంతో ముగుస్తాయని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ కుమార్ తెలియజేశారు

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *