మా ఎమ్మెల్యేలకు విజయ్ డబ్బులు ఆఫర్ చేశారు: పళనిస్వామి
తాము స్వచ్ఛందంగానే విజయ్‌కు మద్దతు ఇస్తున్నామన్న అన్నాడీఎంకే రెబల్ నేత వేలుమణితమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం అధికారికంగా ప్రారంభమైంది. ఊహించినట్లుగానే, ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవలం 22 మంది మాత్రమే వ్యతిరేకించారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ముఖ్యంగా, అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు…


