Last Updated:
KIMS Hospital in Amaravai: గుంటూరు జిల్లా నిడమర్రు సమీపంలోని 25 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనుంది. ఇది అమరావతి రాజధాని అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయి అని అధికారులు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మే 13న రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) హాస్పిట, మెడికల్ యూనివర్సిటీకి భూమిపూజ (శంకుస్థాపన) చేయనున్నారు. గుంటూరు జిల్లా నిడమర్రు సమీపంలోని 25 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనుంది. ఇది అమరావతి రాజధాని అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయి అని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు వివరాలు:
అమరావతి క్యాపిటల్ సిటీ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)తో KIMS గ్రూప్ 60 ఏళ్ల లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 25 ఎకరాల్లోని.. 23 ఎకరాల్లో బైసర్ స్కిల్ యూనివర్సిటీ (Bisar Skill University), 2 ఎకరాల్లో 500-బెడ్ల KIMS కార్పొరేట్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగనుంది. హాస్పిటల్‌లో కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, మదర్ & చైల్డ్ కేర్, క్రిటికల్ కేర్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి అధునాతన సేవలు అందించనున్నాయి. మెడికల్ కాలేజీలో MBBS, నర్సింగ్, ఫార్మసీ, డెంటల్, అనుబంధ కోర్సులు అందుబాటులో ఉంటాయి.
అధికారులు, KIMS ప్రతినిధుల ప్రకారం, నిర్మాణ పనులు 2 నుంచి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యం ఉంది. ఫేజ్-1లో సుమారు 33 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం జరగనుంది. హాస్పిటల్ 2 సంవత్సరాల్లో సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు దూరం ప్రయాణం చేయకుండా అధునాతన వైద్య సేవలు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి ధర ఎకరానికి రూ.50 లక్షల చొప్పున చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు అమరావతిని హెల్త్‌కేర్ హబ్‌గా మార్చడంలో కీలకమైనది. ఇప్పటికే బసవతరకం క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండేషన్ జరిగింది. KIMS వంటి ప్రముఖ సంస్థల రాకతో రాజధాని అభివృద్ధి వేగం పుంజుకుంటుందని నిపుణులు అంటున్నారు. అమరావతి నగర నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టూరిజం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనీ, స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనా. KIMS హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న.. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సంస్థ. అమరావతికి విస్తరణ ద్వారా రాష్ట్ర వైద్య రంగం మరింత బలపడుతుంది.
అమరావతి రాజధాని అభివృద్ధికి ఈ తరహా ప్రైవేటు పెట్టుబడులు కీలకం. ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్‌లపై దృష్టి సారిస్తోంది. ప్రజలు ఈ అభివృద్ధిని స్వాగతిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అమరావతి ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం సమీపంలో లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



