‘సాటన్..2’ క్షిపణి పరీక్ష – Visalaandhra


35 వేల కిలోమీటర్ల పరిధి సామర్ధ్యం: పుతిన్

మాస్కో: ఒక వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, మరో వైపు అంతర్జాతీయ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో రష్యా అణ్యస్త్ర బలోపేతంపై దృష్టి సారించింది. సరికొత్త ఖండాంతర క్షిపణి సార్మాట్‌ను మంగళవారం పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి వోయోవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని చెప్పారు. ఈ క్షిపణిలోని వార్ హెడ్‌ల ఉమ్మడి శక్తి పశ్చిమ దేశాలకు చెందిన ఏ అస్త్రం కన్నా కూడా నాలుగు రెట్లు అధికమని తెలిపారు. సార్మాట్ క్షిపణిని సాటన్2గా కూడా పిలుస్తారు. దీని అభివృద్ధి 2011లో ప్రారంభమైంది. 2024లో దీన్ని పరీక్షించేటప్ప్పుడు భారీ పేలుడు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలన్నింటినీ బోల్తా కొట్టించే సార్మాట్‌కు ఉందని పుతిన్ పేర్కొన్నారు. 35 వేల కిలోమీటర్లుకు పైగా పరిధిని ఇది కలిగి ఉందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *