విద్యుత్ తీగలకు లిఫ్ట్ తగిలి ట్రాక్టర్ నడుపుతున్న రైతు మృతి

విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ మండల పరిధిలోని కొండంపల్లి గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైతు వేణుగోపాల్ రెడ్డి వ్యవసాయ పొలానికి పశువుల ఎరువు తోలుతుండగా, ఎరువును కిందికి వేయడానికి లిఫ్ట్ ఎత్తిన సమయంలో అది విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ సర్క్యూట్ కావడంతో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటనను గమనించిన పక్క పొలాల రైతులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరా…

Read More

ఇరాన్ పై మళ్లీ దాడులు… భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇవాళ్టి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజాగా దాడులు జరపడంతో శాంతి ఒప్పందం ఆశలు సన్నగిల్లాయి. ఈ పరిణామం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 479.26 పాయింట్లు (0.63%) నష్టపోయి 76,009.7 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 118 పాయింట్లు (0.49%) పతనమై 23,913.7 వద్ద ముగిసింది….

Read More

కీవ్‌ను తక్షణమే వీడండి..

అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్‌పై సరికొత్త హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్క్’తో విరుచుకుపడిన రష్యా.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కంటిచూపుతోనే శాసించే స్థాయి భారీ దాడులు చేయబోతున్నామంటూ అధికారికంగా హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయాలు తీసుకునే పరిపాలనా భవనాలు, కమాండ్ సెంటర్లు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్…

Read More

దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు

దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఈ నెల 31 నుంచి జూన్‌ 2 మధ్య కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపింది. అయితే వడగాలుల తీవ్రత మరింత పెరిగితే రుతుపవనాల రాక ఇంకా ఆలస్యం కావచ్చని హెచ్చరించింది. తెలంగాణలో జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రాష్ట్రాలకు…

Read More

పాత ‘ఎమ్‌ ఆధార్‌‘ యాప్ బంద్..కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల

స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ‘ఎమ్-ఆధార్‌ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆధార్్ణ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌్ణ ద్వారా ప్రభుత్వం కోరింది. పటిష్ఠ భద్రతపాత…

Read More

తెలంగాణను బెంబేలెత్తిస్తున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

వడదెబ్బకు ఒక్కరోజే 42 మంది మృతిదేశంలోకి నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి. మరోవైపు, రుతుపవనాల రాక ఆలస్యమవుతుండటంతో…

Read More

అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనని స్పష్టం చేశారు. నాపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం అందింది. నేను ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు…

Read More

విదేశీయులు ‘కైవ్‌’ను వీడి వెళ్లండి: రష్యా

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా శక్తిమంతమైన హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక’ సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని నగరం ‘కైవ్‌’పై మున్ముందు భారీ దాడులు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విధాన నిర్ణయాల్లో కీలకమైన భవనాలు, రక్షణరంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా దాడులు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు…

Read More

ఏపీలోనేపెట్రోల్ ధర అధికం – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా… ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ… ప్రపంచంలోనే భారత్‌లో ఇంధన ధరల…

Read More

ఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకోలేదు – Visalaandhra

‘నీట’ లీక్ కేసుపై సుప్రీం కోర్టున్యూదిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని మందలిం చింది. నీట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌టీఏకి వ్యతిరే కంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం… గతంలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని పేర్కొంది. ఈ…

Read More