ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింస.. ముగ్గురి మృతి, భద్రతా సిబ్బందికి గాయాలు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. నార్త్ 24 పరగణాస్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాత్రివేళ సున్నిత ప్రాంతాల్లో పహారా కాస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో పాటు బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటివరకు కనీసం ముగ్గురు…


