లత్తవరం గ్రామంలో నూతన బోరు బావి ప్రారంభం


విశాలాంధ్ర – ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశాలతో ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి సమీపంలో నూతన బోరు బావిని ఏర్పాటు చేసినట్లు మంగళవారం గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావికి మోటార్ అమర్చి నేడు నీటిని పంప్ చేయగా సుమారు 2 ఇంచుల మేర నీరు రావడం జరిగింది. వేసవికాలంలో గ్రామ ప్రజలకు తీవ్రంగా ఉన్న నీటి సమస్యను ఈ బోరు బావి కొంతవరకు పరిష్కరిస్తుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *