Last Updated:
Annavaram Temple: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. ఆకాశవీధిలో కనిపిస్తున్న రథంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తూ ముందుకు వచ్చారు.
Annavaram Temple: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.దీనిలో భాగంగా గురువారం సాయంత్రం స్వామి అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం అన్నవరం గ్రామంలో ఘనంగా జరిగింది. ఆకాశవీధిలో కనిపిస్తున్న రథంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తూ ముందుకు వచ్చారు, రధాని లాగుతూ రథం వెనక అడుగులో అడుగు వేస్తూ పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివ కేశవులు ఇద్దరూ కొలువైన అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రంలో స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.దీనిలో భాగంగా కళ్యాణంలో అత్యంత కీలక ఘట్టమైన స్వామివారి రథోత్సవం అత్యంత ఘనంగా గురువారం రాత్రి అన్నవరం గ్రామంలో ప్రారంభమైంది, ఆకాశవీధిలో రథం, రథంపై శ్రీ సత్యవతి అనంతలక్ష్మిదేవి,శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను వేయించింపచేసి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కాంతులు చక్కని పువ్వుల అలంకరణలో రథం అన్నవరం గ్రామంలో ముందుకు వస్తూ ఉండగా, భక్తులు స్వామివారి రథాన్ని కనులారా తిలకించి రథం వెనుక అడుగులో అడుగు వేస్తూ రథోత్సవంలో పాలుపంచుకున్నారు. ఒకసారి అన్నవరంలో కళ్యాణ మహోత్సవాలు రథోత్సవం వివరాలు క్లుప్తంగా చూద్దాం.
తెలుగు లోగిలిలో ఎలాంటి శుభ కార్యక్రమం జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించడం, పరమ పావనమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం హిందూ సంస్కృతిలో ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. అటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏడాదికి ఒకసారి అన్నవరం రత్నగిరి కొండలపై అన్నవరం దేవస్థానం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి దాదాపు 6 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ప్రధానంగా స్వామివారి కళ్యాణం అదే విధంగా స్వామివారి రథోత్సవానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవచ్చు.
స్వామివారి రథోత్సవంలో భాగంగా ఆకాశవీధిలో ఉన్న రథం అన్నవరం గ్రామంలోకి ప్రవేశించగానే గోవింద నామాల జపిస్తూ లక్షలాదిగా భక్తులు రధానికి స్వాగతం పలికారు. ప్రధాన రహదారిపై హారతిలిస్తూ రధాని భక్తిశ్రద్ధలతో భక్తజనులు స్వాగతించారు, అనంతరం ఇసుక వేస్తే రాలని విధంగా భక్త జనులు రథం లాగుతూ రథం వెనక అడుగులో అడుగు వేస్తూ శ్రీసత్యనారాయణ శ్రీఅనంతలక్ష్మీ అమ్మవార్లు ఊరేగుతున్న రథసేవలో పాలుపంచుకున్నారు, జిల్లా పోలీస్ అధికారులతో పాటు అన్నవరం దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు, ఏది ఏమైనా ఈ ఏడాది చూడగలమా ఇంతకీ వైభోగం అన్న మాదిరిగా స్వామి వారికల్యాణ మహోత్సవాలు రథోత్సవం సైతం జరిగిందని చెప్పుకోవచ్చు.
పంచాంగం, రాశులు, దినఫలాలు, వారఫలాలు, న్యూమరాలజీ, వాస్తు టిప్స్, ఆలయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ధార్మిక సంబంధమైన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆస్ట్రాలజీ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
West Godavari,Andhra Pradesh
May 01, 2026 11:48 AM IST


