మే 14 – 15 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మే 15 – 16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గాలి వేగం పెరిగి (గంటకు 40-50 కి.మీ) వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మే 15 నుండి వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా మే 17 నాటికి కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు కూడా వడగాల్పులు విస్తరించే ప్రమాదం ఉంది.



