ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో తీవ్ర ఎండ వాతావరణమే ఉంటుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్ది సేపు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. అది గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతోంది. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఇవాళ అత్యంత వేగవంతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వాటి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఉత్తరాంద్ర ప్రజలు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేడి గాలులు, ఎండ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ, రాయలసీమ, హైదరాబాద్, తెలంగాణ అంతటా ఇవాళ తీవ్ర ఎండలే ఉంటాయి. (All Image credit – zoom.earth)



