వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు
విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…


