Shocking Snake: చేప కాదు పైథాన్.. మత్స్యకారుల వలకు చిక్కిన భారీ సర్పం |


Last Updated:

Python: ఏపీలో ఆ జిల్లాలో ఒకవైపు ఎండలు, మరో పక్క వర్షాల నేపథ్యంలో విషజీవులు, గోదావరి అదేవిధంగా నివాసాల్లోకి సైతం చొరబడుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో జరిగిన ఒక ఘటన మత్స్యకారులను కుదిపేసింది.

+

Python

Python

Python: ఏపీలో ఆ జిల్లాలో ఒకవైపు ఎండలు, మరో పక్క వర్షాల నేపథ్యంలో విషజీవులు, గోదావరి అదేవిధంగా నివాసాల్లోకి సైతం చొరబడుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో జరిగిన ఒక ఘటన మత్స్యకారులను కుదిపేసింది. వర్షాలు వరుసగా పడ్డాయి. చేపలు అధికంగా దొరికే అవకాశం ఉందని, ఆప్రాంతంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో భారీ బరువు గల పొడవైన కొండచిలువ చిక్కింది. భారీ చేప చిక్కిందని సంతోష పడిన మత్స్యకారులు దాన్ని బోట్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉండగా వలలో కొట్టుకుంటూ వచ్చింది చేప కాదని కొండచిలువ అని తెలియడంతో ఒక్కసారిగా భయాందోళన చెందారు. చివరికి ఏమైంది? ఇంతకీ ఏ ప్రాంతంలో వాళ్లకు ఈ భారీ కొండ చిలువ చిక్కింది? అక్కడ మత్స్యకారులు ఏం చెబుతున్నారు? చివరికి ఆ కొండచిలువును ఏం చేసారు? ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

మత్స్యకారుల వలకు చిక్కిన సర్పం..

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో విష సర్పాల భయం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ జిల్లాలో అధిక ప్రాంతం అటవీ ప్రాంతంగా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు రంపచోడవరం డివిజన్ అంత పెద్దఎత్తున అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఓవైపు వేసవి తాపం పెరగడంతో అడవిలో చెట్ల మధ్యలో ఉండాల్సిన పాములు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఈమధ్య కాలంలో అనేకం చూశాం. తాజాగా భారీ కొండచిలువ గోదావరిలో ప్రవేశించింది. గత రెండు రోజుల కింద వర్షాలు పడిన నేపథ్యంలో చేపలు వలలకు చిక్కే అవకాశం ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తానే లంక ప్రాంతంలో మత్స్యకారులు చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లారు. ఇలాంటి తరుణంలో వారి వరకు భారీ బరువు గల ఈ కొండచిలువ చిక్కింది.

చేప కాదు పైథాన్..

మత్స్యకారులు వలలో చిక్కింది చేప అనుకున్నారు. దాన్ని పడవలోకి ఎక్కిస్తుండగా కదలడంతో కొండచిలువుగా గుర్తించారు. భయంతో వలను వదిలేయలేక, పడవలోకి లాగి అక్కడ నుంచి నేరుగా ఒడ్డుకు వచ్చేసారు మత్స్యకారులు. ఏమాత్రం బయటకు తీసిన వారిపై విరుచుకుపడుతుందని భయంతో అధికారులకు తెలియజేశారు. దీంతో స్థానిక ఎస్సై విద్యాసాగర్ రావు స్థానికుల సహాయంతో ఆ భారీ కొండ చిలువను వలలోంచి బయటకు తీశారు .నిజానికి ఆ కొండ చెరువు సైతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం గోనెలో వేసి అటవీశాఖ అధికారుల ద్వారా దట్టమైన అడవిలోకి వదిలేసే ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా మత్స్యకారులు వలలో చిక్కిన కొండచిలువ విషయం గ్రామమంతా తెలియడంతో పెద్ద ఎత్తున చూసేందుకు ఆ ప్రాంతానికి ప్రజలు చేరుకున్నారు.ప్రస్తుతం ఎండల నేపథ్యంలో విశసర్పాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *