అంజన్ రెడ్డి పై మంత్రి అనుచరుల దాడిపై తీవ్ర నిరసన


కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబు తో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి చేసిన ఘటన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కళా జ్యోతి సర్కిల్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి అనుచరుల ఆగడాలు ధర్మవరం పట్టణంలో పిచ్చిమీరుతున్నాయని, అరికట్టాల్సిన ప్రజా ప్రతినిధులే ఏమి చేయలేకపోవడం దారుణమన్నారు. కర్నూల్ రౌడీలను నియంత్రించకపోతే తిరిగి ధర్మవరంలో ఫ్యాక్షనికు ప్రోత్సహించినట్లు అవుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా పట్టణానికి స్థానికేతరులు వచ్చి స్థానికులపై దౌర్జన్యం దాడులు చేసే సహించేది లేదని వారు హెచ్చరించారు. అతి త్వరలో తరిమి తరిమి కొడతామని వారి హెచ్చరించారు. అంజన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. దాన్ని అడిగే పద్ధతిలో అడగాలని గాని, దాడులు ఎలా చేస్తారు అని వారు తీవ్రంగా విమర్శించారు. ధర్మవరం ప్రజలు మంత్రిని ఎంతగానో నమ్మి ఓటు వేసి గెలిపిస్తే ఆయన ఇక్కడ కర్నూలు నుంచి పెట్టడం సమంజసం కాదని తెలిపారు. అమాయకులైన బిజెపి మహిళలను హనీ ట్రాప్ లో బదరాయించడం జరిగిందని వారు గుర్తు చేశారు. హనీ ట్రాప్ పై సి బి సి ఐ డి ద్వారా విచారణ జరిపితే అన్ని బయటకు పడతాయని తెలిపారు. ఏది ఏమైనా అంజన్ రెడ్డికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.మంత్రి అనుచరుల యొక్క ఆగడాలు, దౌర్జన్యాలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, ఏదో ఒక రోజు తిరగబడే రోజు వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు చూడగల గిరిధర్ చిలకం సూర్యనారాయణ రెడ్డి ,సేక్షావలి, వీరన్న, రాము, నారాయణస్వామి, గందిమినేని నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *