పీసీపీఎన్డీటీ చట్ట ఉల్లంఘనలపై టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్


1800 233 2447 ఏర్పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,డాక్టర్ ఈ .బి దేవి
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్ 1800 233 2447 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈ బి దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, చేయించుకోవడం, అలాగే ప్రోత్సహించడం పీసీపీఎన్డీటీ చట్టం, 1994 ప్రకారం తీవ్రమైన నేరమని సృష్టంచేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వైద్యులు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు లింగ నిర్ధారణపై ఫిర్యాదుల స్వీకరణ కు రాష్ట్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడమైనది . ఆడబిడ్డలసంరక్షణ చర్యల్లో భాగంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, భ్రూణ హత్యల నివారణ కు అమల్లో ఉన్న పీసీ-పీఎన్డీటీ చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్య కలాపాలు జరిగినా, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని గర్భస్రావం చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా, పీసీ-పీఎన్డీటీ చట్టం అమలులో ఉల్లంఘనలు చోటుచేసుకున్నా టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖ అధికారి డాక్టర్ ఈ. బి దేవి పేర్కొ న్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *