ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా .. దెబ్బతిన్న WHO ఆఫీస్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన వరుస దాడులలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కార్యాలయం దెబ్బతింది. రష్యా క్షిపణి దాడుల తర్వాత పడిన శకలాలు భవనాన్ని తాకడంతో మూడో అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆరోగ్య సేవలు, పౌరులపై దాడులు వెంటనే ఆపాలని ఆయన కోరారు. ఆరోగ్య…


