ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటున్యూదిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె…


