నాల్గవ జోన్ కలయికతో పరిధి పెంచుకున్న కాకినాడ ఎపిఐఐసి ప్రాంతీయ కేంద్రం
— ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని విశాలాంధ్ర – కడియం : పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కాకినాడ ఏపీఐఐసీసీ ప్రాంతీయ కార్యాలయం నాలుగవ జోన్ కలయికతో మరింత పరిధి పెంచుకుంటుందని ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం కాకినాడ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కూడా కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో కలవడంతో పరిధి విస్తరించిందని పేర్కొన్నారు. అన్ని వనరులు…


