ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా – Visalaandhra


మృతుని భార్యకు రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

విశాలాంధ్ర-హైదరాబాద్: ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ భార్య (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయు) ప్రకారం…యుఎస్ ఎస్ ఏ-2, యుఎస్ ఎస్ ఏ-3 పథకాల కింద శాలరీ ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ. 1 కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ పథకంలో భాగంగానే… ఎన్పీడీసీఎల్ బాసర పరిధిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్, 2024, సెప్టెంబర్‌న బాసర శాఖలో తన ‘యుఎస్ ఎస్ ఏ-2’ శాలరీ ప్యాకేజీ ఖాతాను ప్రారంభించారు. అయితే, దురదృష్టవశాత్తు ఆయన 2025, మార్చి 24న విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. దీనితో బీమా మొత్తం రూ. 1 కోటి గత నెల 30వ తేదీనీ స్వప్న బ్యాంకు ఖాతాలో జమ అయింది. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈఓ అశిశ్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేశ్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, నిజామాబాద్ రీజినల్ హెడ్ అరుణ సవిత, చీఫ్ మేనేజర్ వైవీ రాఘవ, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *