ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.



