మోదీ సెషెల్స్ పర్యటన ఆంతర్యం – Visalaandhra
సాధారణంగా అవార్డులు తెచ్చుకునేవే తప్ప వచ్చేవి కావు. ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఏదో అవార్డు తెచ్చుకుంటూ ఉంటారు. మోదీ ప్రధానమంత్రి ఐనప్పటి నుంచి లెక్కలేనన్ని విదేశీ యాత్రలు చేశారు. ఈ యాత్రల వల్ల మన దేశానికి ఒరిగిందేమిటి అని ఆలోచిస్తే నిరాశ మిగులుతుంది. కానీ రికార్డు స్థాయిలో విదేశీ యాత్రలు చేసిన సంతృప్తి మాత్రం మోదీకు ఉంటుంది. ఇటీవలే మోదీ హిందూ మహాసముద్రంలోని ఓ చిన్న దేశమైన సెషెల్స్‌లో పర్యటించారు. అక్కడ ఆయనకు గార్డియన్ ఆఫ్…


