Last Updated:
Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి.
మొగిలి ఆలయ భూముల రక్షణ, గుడి ఆదాయంపై ప్రశ్నించడం తప్పా..?
ప్రశ్నిస్తే అర్చకులు, గ్రామస్తులు దౌర్జన్యం చేశారనే ఆరోపణ..
ఆరోపణలు అవాస్తవమని మీడియా ముందు వెల్లడి
దేవాదాయశాఖకు చేసిన కంప్లైంట్‌కి కట్టుబడే ఉన్నా
మాజీ సర్పంచ్ కుమారుడు మంజునాథ్ కామెంట్స్
Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిల్లీశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం అయ్యాయని మొగిలి మాజీ సర్పంచ్ కుమారుడు డి.మంజునాథ్ సంచలన ఆరోపణలు చేశారు. తన స్వగ్రామంలో మీడియాతో మాట్లాడిన మంజునాథ్ కొంతమంది అర్చకులు గంగాధర్ గురుకుల్ వారి కుమారులు గుడి మాన్యం భూములను గ్రామ కంఠం భూములుగా మార్చి అమ్మేశారని ఆరోపించారు. అయితే ఈవిషయంలో కొందరు తనపై కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఆలయ భూములు అక్రమించలేదని అలా చేసి ఉంటే విచారణ చేపట్టాలని ఎవరైతే తప్పు చేసినట్లుగా నిర్ధారణ జరుగుతుందో వాళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో పూర్వం నుండి దీప,దూప నైవేద్యాలు కొనసాగిస్తున్న ఆలయాలకు కొన్ని భూములు ఉండేవి. వీటిని దేవుడు మాన్యాలు అంటారు. అంటే భవిష్యత్తులో ఆలయ అభివృద్దికి లేదంటే ఆలయాల పునర్‌నిర్మాణం కోసం వాటిని ఉపయోగించడానికి వీలుగా కొన్ని భూములను ప్రత్యేకించి ఉంచేవారు. అంటే ఆ మాన్యం భూములు ఎవ్వరు ఆక్రమణ చేయకూడదు. అయితే సాగు చేసుకోవచ్చు. అందులో గ్రామస్థులు నిర్ణయినచిన మేర కొంత దేవాలయ అభివృద్ధి కొరకు వినియోగించుకోవాలి. అంతే తప్పా సర్వ హక్కులు ఎవరికి ఉండవు. ఆ ఆలయాల్లో పని చేసే అర్చకులు మాన్యాలు నుండి వచ్చే సొమ్మును, దేవుడు పూజా కైంకర్యాలకు, ఆలయ అభివృద్ధి కొరకు వినియోగించుకోవాలి వాటిని అమ్మడం, కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని దేవాదాయశా వారు చెప్పిన విషయం. అన్నీ చోట్ల ఇదే అమలు అవుతుంది. కానీ బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో దీనికి విరుద్ధంగా జరిగింది.
దేవుడి మాన్యం భూములు కాపాడాల్సిన అర్చకులే గ్రామ కంఠంగా మార్చి అమ్మకాలు సాగించారు. చిత్తూరు జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మొగిలీశ్వర స్వామి ఆలయంలో దేవుడు మాన్యం సుమారు రూ.50 లక్షలు విలువ చేసే భూమిని ఇలాంటి ఆక్రమణకు పాల్పడినట్టు స్థానిక గ్రామ వాసి, సర్పంచ్ కుమారుడు మంజునాథ్ బహిర్గతం చేశారు. అంతే కాదు అభివృద్ధి కావాల్సిన దేవాలయాన్ని కుంటు పడేటట్లు చేస్తున్నారు. స్వామి వారి సేవా టికెట్లల్లో వాటాలు, హోమాల్లో వాటాలు అన్ని చోట్లా ఆలయ అభివృద్ధిని నిలువు ధోపొడి చేస్తున్నారని విమర్శలు చేశారు. దీనిపై సంబంధిత శాఖల్లో పిర్యాదు చేస్తే తనపై అర్చకులు, గ్రామంలోని కొందరు కలిసి తనపై దౌర్జన్యానికి దిగి ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలిపారు.
తాను చేస్తున్న ఆరోపణలపై దేవాదాయశాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మొగిలి గ్రామంలో అర్చకులు సోమశేకర్ గురుకుల్ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని దీనిపై సంబంధిత శాఖలు విచారణ చేపట్టి మాన్యం భూములు కాపాడాలి, దేవాలయ అభివృద్ధి కి కృషి చేయాలని మంజునాథ్ కోరారు.మరి ఆరోపణలపై అధికారులు ఎలాంటి అడుగువేస్తారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


