Lovers Sucide: ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి వెళ్లిన ప్రేమ జంట.. చివరి క్షణంలో ఏం జరిగిందో తెలుసా?.. సినిమాను తలపించే ట్విస్ట్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి రైల్వే పట్టాలపై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

News18
News18

ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి రైల్వే పట్టాలపై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ క్షణంలో దేవుడిలా ప్రత్యక్షమైన పోలీసులు వారి జీవితాలను మళ్లీ ఆశల బాట పట్టించారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన పి.లావణ్య, బి.గణేష్ గత నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాన్ని కలిసి గడపాలని కలలు కన్నారు. కానీ వారి ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభించలేదు. దీంతో ఈ నెల 19న ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. మొదట్లో కొత్త జీవితంపై ఆశలు పెట్టుకున్నా, రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు కఠినంగా మారాయి. చేతిలో ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోయింది. ఎక్కడికి వెళ్లాలో, ఎలా జీవించాలో అర్థంకాక తీవ్ర ఆందోళనలోకి వెళ్లిపోయారు.

సోమవారం ఆమదాలవలస బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే పట్టాల వద్ద నిలబడి జీవితానికి ముగింపు పలకాలని భావించిన ఆ క్షణంలో విధుల్లో ఉన్న శక్తి టీమ్–2 ఇన్‌చార్జి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ధనలక్ష్మి వారి అనుమానాస్పద ప్రవర్తనను గమనించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే అప్రమత్తమై యువజంటను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఆ తర్వాత వారితో ఆప్యాయంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. “జీవితం ఒక్క క్షణంతో ముగిసిపోదు… ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది” అంటూ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆమదాలవలస పోలీసులకు, పాలకొండ ఎస్‌ఐకు సమాచారం అందించి యువజంటను పాలకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సమయస్ఫూర్తితో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన శక్తి టీమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ అభినందించారు. యువత చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఈ ఘటనలో పోలీసుల అప్రమత్తత రెండు ప్రాణాలను మాత్రమే కాదు… రెండు కుటుంబాల్లో మళ్లీ ఆశల దీపాన్ని వెలిగించింది. ప్రేమలో ఓటమి వచ్చినా జీవితంలో ఓటమి కాదని, ఒక మంచి మాట… ఒక చేయూత… ఒక సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడగలదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *