కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.
ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో బాధ్యతలు చేపట్టాక కంపెనీ షేరు విలువ 20 రెట్లు పెరిగి ఆర్థిక మహాశక్తిగా ఉదయించింది. ఇక జానీ స్రౌజీని కంపెనీ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్‌గా నియమించింది.
ఎన్విడియాతో పోటీగా…
ఈ నాయకత్వ మార్పుతో యాపిల్ ఆపరేషనల్-సప్లైచైన్ నైపుణ్యాల నుంచి హార్డ్‌వేర్, ఏఐ వైపు దృష్టి మరల్చినట్లైంది. ముఖ్యంగా చిప్ దిగ్గజం ఎన్విడియాతో టెక్నాలజీ, ఏఐ విభాగంలో పోరుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఎన్విడియా యాపిల్ మార్కెట్ విలువను దాటేసింది. 2001లో యాపిల్‌లో చేరిన టర్నెస్‌కు ఇప్ప్పువ్ప్పుిడు వయసు 50 ఏళ్లు. ఆయన సుదీర్ఘకాలం కంపెనీని నడిపించవచ్చన్న అంచనాలున్నాయి. కంపెనీ కీలక ప్రాజెక్టులైన మ్యాక్, ఐపాడ్స్, ఎయిర్‌పాడ్స్ డిజైనింగ్, డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించారు. మ్యాక్ విక్రయాలను పుంజుకొనేలా చేసేందుకు ‘ప్రో’ను తీసుకొచ్చారు.
The post యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్ appeared first on Visalaandhra.


