ఎల్ నినో వస్తే సమస్యేంటి?: వాతావరణ మార్పులు అనేవి మనకు వెంటనే ఫలితం చూపించవు. ఎల్ నినో అలాంటిదే. ఇది వచ్చినప్పుడు మన ఏపీ, తెలంగాణ, హైదరాబాద్‌లో ఎండల తీవ్రత బాగా పెరగడమే కాదు.. పంటలు సరిగా పండవు. పువ్వువు, కాయలు రావు. దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే.. నదులు, చెరువుల్లో నీరు బాగా తగ్గిపోతుంది. మన గోదావరి, కృష్ణా నదుల్లో కూడా నీరు చాలా వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే.. రాయలసీమ, ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నీటి కొరత సమస్యలు రావచ్చు. ఈసారి వచ్చేది సూపర్ ఎల్ నినో కాబట్టి.. ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉండగలవు.



