తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు న్యాయపోరాటం దిశగా మారుతోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మెజారిటీని సభలోనే తేల్చాలే తప్ప, ముందే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్…


