Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? |


Last Updated:

Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది.

News18
News18

Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ విరాళం ద్వారా పేద , ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మరింత సహకారం అందనున్నది. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో హిమాద్రి ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ అనురాగ్ చౌదరి ఈ విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు.

విరాళాలతో వైద్యం..

సమాజ సేవా దృక్పథంతో ముందుకొచ్చిన హిమాద్రి ఫౌండేషన్ దాతృత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు . ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా అనేకమంది నిరుపేద రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రాణాపాయ చికిత్సలు అందుతున్నాయని, ఇటువంటి విరాళాలు వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. సేవాభావంతో సమాజానికి తోడ్పడే దాతలు పెరగడం ఆనందకర విషయమని పేర్కొన్నారు.

ఫ్రీ హెల్త్ సర్వీస్..

తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలతో పాటు టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ పేరుతో నిరుపేదలు, ఆర్ధికంగా చితికిపోయిన ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం, వైద్య సేవల కోసం ఈ డబ్బును ఖర్చు చేస్తోంది. దీన్ని 2001వ సంవత్సరంలో ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్ బాధితులు, నరాల బలహీనత, తలసెమియా, హీమోఫిలియాతో పాటు ఇతర ప్రాణపాయ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ట్రీట్‌మెంట్ అందజేస్తోంది. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ శ్రీ రవినాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దాత కుటుంబ సభ్యులను టీటీడీ అధికారులు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *