త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు….


