ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, డిజిటల్‌ సేవల రంగ సంస్థల్లో సాధ్యమైన చోట్ల తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరింది.ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలో NITES ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన…

Read More

పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి

కడప రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నేత నిత్యానందరెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 20 రోజులుగా పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఉదయం ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయానికి…

Read More

రాహుల్ గాంధీ పోస్టులపై చర్యలు తీసుకోలేదు: కేంద్ర ఐటీ శాఖ

రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులను కేంద్రం నిరోధించిందంటూ ఆరోపణలుతమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ వర్గాలులోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు ఖండించాయి. తమ వైపు నుంచి అలాంటి చర్యలు గానీ, ఆదేశాలు గానీ లేవని స్పష్టం చేశాయి. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో జరిగిన పొరపాటు…

Read More

టేకాఫ్‌ సమయంలో భయానక ఘటన.. ఇంజిన్‌లోకి వ్యక్తిని లాక్కొన్న విమానం..

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్‌లోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్‌లన్స్ విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రన్‌వే దాటుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా భద్రతా కంచెను దూకి విమానానికి అత్యంత సమీపంగా చేరుకున్నాడు. అదే సమయంలో టేకాఫ్‌ కోసం వేగం పెంచుతున్న ఎయిర్‌బస్ A321 విమానం ఇంజిన్‌ అతడిని ఒక్కసారిగా లోపలకు లాగేసుకుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు….

Read More

మోదీకి ఒట్టేసి చెప్పా: అన్నా లెజినోవా

హైదరాబాద్: మోదీకి తాను ఒక ప్రామిస్ చేసినట్లు పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్ పెట్టారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. పవన్, ఆయన సతీమణి అన్నా కొణిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా పవన్ కుటుంబంతో కొంత సమయాన్ని…

Read More

ముగింపు దశకు రష్యా…ఉక్రెయిన్ యుద్ధం! – Visalaandhra

మాస్కో: నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. యూరప్ లో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని సృష్టించిన ఈ యుద్ధం త్వరలోనే ముగియనుంది. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన వేలాది మంది సైనికులు మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత రక్తపాతం సృష్టించిన యుద్ధం ఇదే. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగింపు దశకు…

Read More

గంగినేని చెరువుకు చెర – Visalaandhra

అధికారుల మొద్దు నిద్ర (విశాలాంధ్ర-చిత్తూరు) చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక గంగినేని చెరువు కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కోరల్లో చిక్కుకుంది. సుమారు రూ.50 కోట్లకు పైగా విలువ చేసే చెరువు భూములను కొల్లగొట్టేందుకు బడా బాబులు బరితెగిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగర ప్రజలకు ఒకప్పుడు సాగునీరు, తాగునీరు అందించిన ఈ చెరువు విస్తీర్ణం రికార్డుల ప్రకారం 62 ఎకరాలు. చెరువుకు సంబంధించిన…

Read More

నిబంధనలకు పాతర

ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ*నిద్రమత్తులో అధికార యంత్రాంగం (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని…

Read More

అన్నాడీఎంకేలో ఆదిపత్య పోరు – Visalaandhra

పళనిసామిషణ్ముగం వేరు వేరు క్యాంప్ రాజకీయాలు చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐడీఎంకేలో వర్గ పోరు మొదలైంది. పళనిస్వామిషణ్ముగం మధ్య ఆదిపత్య పోరు బయటపడింది. ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకేలో నాయకత్వ సమస్యలు బయట పడుతున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. రెండు రోజుల క్రితం పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 36 మంది శిబిరం నిర్వహించగా, పళనిసామి అక్కడికి వెళ్లి వారితో భేటీ అయిన…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More