పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విట్టర్) బయోను అప్డేట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత ..ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.ఆ తర్వాత మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి దానిని రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. నేడు రాష్ట్ర సీఎంగా భాజపా నేత సువేందు అధికారి ప్రమాణం చేశారు. దీంతో దీదీ తన ఎక్స్ బయోను అప్డేట్ చేశారు. ‘అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ) అని మార్చుకున్నారు. అంతకుముందు ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని మాత్రమే ఉండేది.
The post ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ appeared first on Visalaandhra.


