మోదీకి ఒట్టేసి చెప్పా: అన్నా లెజినోవా


హైదరాబాద్: మోదీకి తాను ఒక ప్రామిస్ చేసినట్లు పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్ పెట్టారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. పవన్, ఆయన సతీమణి అన్నా కొణిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా పవన్ కుటుంబంతో కొంత సమయాన్ని గడిపారు. పవన్ కుటుంబంతో కొంత సేపు ముచ్చటించారు.
మోదీతో ఉన్న ఫొటోలను పంచుకున్న పవన్ భార్య అన్నా లెజినోవా… ‘ప్రధాని మా ఇంటికి వచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజును జీవితంలో మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు ప్రామిస్ చేశాను’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు పవన్ ఇంటికి వెళ్లిన విషయాన్ని తెలుపుతూ మోదీ కూడా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని… ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఇక ప్రధాని స్వయంగా తన ఇంటికి వచ్చి పరామర్శించడంపై పవన్ కల్యాణ్ ‘ఎక్స’లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని వ్యక్తిగతంగా వచ్చి చూపిన ఆప్యాయత తనకు జీవితాంతం గుర్తుంటుందన్నారు. ‘ప్రధాని మాతో గడిపిన విలువైన సమయానికి నేను చలించిపోయాను’ అని పవన్ పేర్కొన్నారు.

The post మోదీకి ఒట్టేసి చెప్పా: అన్నా లెజినోవా appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *